Share News

SAVITA : ఈవీఎంల రక్షణ బాధ్యత పోలీసులదే

ABN , Publish Date - May 23 , 2024 | 12:02 AM

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సా్ట్రంగ్‌ రూమ్‌లలో భద్ర పరిచిన ఈవీఎంల రక్షణ బాధ్యత పోలీసులదేనని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె గురువా రం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, 130సీట్ల లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

SAVITA : ఈవీఎంల రక్షణ బాధ్యత పోలీసులదే
Savita who is dealing with TDP ranks at Bit College

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

పెనుకొండ టౌన, మే 22 : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సా్ట్రంగ్‌ రూమ్‌లలో భద్ర పరిచిన ఈవీఎంల రక్షణ బాధ్యత పోలీసులదేనని టీడీపీ కూట మి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. ఆమె గురువా రం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, 130సీట్ల లో కూటమి అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఓటర్లు ఉప్పెనలా తరలి వచ్చారని వారందరికీ కృతజ్ఞతలు తెలి పారు. స్థానిక ఎన్నికల్లో చేసిన దౌర్జన్యాలు, అరాచకాలను ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగించి గెలుపు సొంతం చేసుకోవాలని చూసి వైసీపీ విఫలమైందన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన అధికారులు, మీడియా, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ పాలనలో విసిగిపోయిన మహిళలు, అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని భావించి పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారన్నారు. జిల్లాలో ఏడు నియోజక వర్గాలతో పాటు ఎంపీ స్థానం గెలువబోతున్నట్లు తెలిపారు. ఐదేళ్ల వైసీపీ పాలన లో భయాందోళనతో పనిచేసిన అధికారులు ఇప్పుడు బాధ్యతగా వ్యవహరించార న్నారు. ఎన్నికల ముందు వైనాట్‌ 175అని చెప్పిన వైసీపీ ఇప్పుడు 75సీట్లు వస్తా యని చెప్పుకోవడానికి కూడా వెనుకా డుతోందన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షు డు కొల్లకుంట అంజి నప్ప, నాయకు లు మాధవనాయుడు, మాజీ జడ్పీ టీసీ వెంకటరమణ, శ్రీని వాసులు, డీవీ ఆంజనేయులు, నీరు గంటి చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


సా్ట్రంగ్‌రూంలు పరిశీలించిన సవిత

హిందూపురం అర్బన: స్థానిక బిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్‌ రూంలను బుధవారం టీడీపీ పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పరిశీలించారు. అదే విధంగా నాయకులు, కార్యకర్తలతో సార్వత్రిక ఎన్నికల సందర్బంగా పోలింగ్‌ సరళిని అడిగి తెలుసుకున్నారు. జూన 4వ తేదీన ఓట్ల లెక్కింపు కోసం అందరూ ఎదురు చూస్తున్నారని, తెలుగుదేశం గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. సవిత వస్తున్న విషయం తెలుసుకొని కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆమెను పలుకరించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 23 , 2024 | 12:02 AM