Share News

AP elections: మైనార్టీలను మభ్యపెడుతున్నారా..?

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:38 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి వైసీపీ అభ్యర్థి బీఎస్‌ మగ్బుల్‌ అహమ్మద్‌ చెబుతున్న మాటలను మైనారీటీలు నమ్ముతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల ఓ టీవీ చానల్లో మాట్లాడుతూ తాము భేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పెట్టిన బిల్లులు అన్నిటికి వైసీపీ మద్దతు తెలిపింది. సీఏఏ, ఎనఅర్‌సీకి మద్దతు ప్రకటించింది.

AP elections: మైనార్టీలను మభ్యపెడుతున్నారా..?

మగ్బుల్‌ మాటలను ఆ వర్గాలు నమ్ముతాయా..?

కదిరిలో వైసీపీ ద్వంద్వ వైఖరిపై మైనార్టీల ఆగ్రహం

కదిరి, ఏప్రిల్‌ 25 : ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి వైసీపీ అభ్యర్థి బీఎస్‌ మగ్బుల్‌ అహమ్మద్‌ చెబుతున్న మాటలను మైనారీటీలు నమ్ముతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల ఓ టీవీ చానల్లో మాట్లాడుతూ తాము భేషరతుగా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పెట్టిన బిల్లులు అన్నిటికి వైసీపీ మద్దతు తెలిపింది. సీఏఏ, ఎనఅర్‌సీకి మద్దతు ప్రకటించింది. ఎంపీ విజయసాయి రెడ్డి గత పార్లమెంటు లో బీజేపీ పెట్టిన బిల్లులకు మద్దతు పలికారు. అయినా ఇక్కడ మాత్రం వైసీపీ అభ్యర్థి మగ్బుల్‌ అహమ్మద్‌ ఎన్నికల సభల్లో ఎనఅర్‌సీ అంటే ముస్లింల ఆస్తులు లాక్కొని బయటకు పంపివేయడమే అని వక్రభాష్యాలు చెబుతున్నారు. ఈ రకమైన మాటలు మైనార్టీలను మభ్యపెట్టాడనికి చెబుతున్నారని ఆ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి.


ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మగ్బుల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ వర్గాల వారే అంటున్నారు. మైనార్టీలను మోసం చేయడానికి ఇలాంటి మాటలు చెబుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కదిరిలో నిలకడలేని నాయకత్వం నిలుస్తుందాని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక కొత్త అభ్యర్థిని బరిలోకి దింపే వైసీపీ ప్రజల అభివృద్ధి గురించి పట్టించుకుంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మైనార్టీలను మభ్యపెట్టడుతున్న వైసీపీ

మైనార్టీలను వైసీపీ మభ్యపెడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎనడీఏ ప్రభుత్వానికి గత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టిన దాదాపు అన్ని బిల్లులకు మద్దతు తెలిపింది. ఎనఅర్‌సీ, సీఏఏ లాంటి అంశాలకు అండగా నిలిచింది. త్రిపుల్‌ తలాక్‌, అర్టికల్‌ 370 వంటి బిల్లులకు మద్దతు తెలిపింది. వైసీపీ మంత్రి ఇటీవలే మాట్లాడుతూ తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ వైసీపీ అని, అందుకే తాము బీజేపీకి మ ద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. కదిరిలో మాత్రం మైనార్టీల ప్రచార సభల్లో ఎ నఅర్‌సీ అంటే ముస్లింల ఆస్తులను లాక్కొని బయటకు పంపడమేనని కదిరి వైసీపీ అభ్యర్థి మగ్బుల్‌ చెబుతున్నారు. ఇలాంటి మాటలు మైనారీటీ ఓట్ల కోసమేనని అంటున్నారు. అసత్యాలను నిజాలుగా చెప్పి ఓట్లు దండుకోవడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మైనార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిలకడలేని వైసీపీ నాయకత్వం

కదిరిలో వైసీపీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికకు వైసీపీ అభ్యర్థిని మార్చడమే ఇందుకు నిదర్శనం.


2014లో వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్‌ చాంద్‌బాషను బరిలో దింపారు. అయన గెలిచిన రెండు సంవత్సరాలకే తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. అనక ఇటీవల మళ్లీ వైసీపీలోకి జంప్‌ అయ్యారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డిని బరిలో నిలిపారు. అయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అంతర్గత వర్గపోరుతోనే సరిపోయింది. నియోజక వర్గ అభివృద్ధి చేసిందేమీ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనను కనీసం పరిగణలోకి కూడా తీసుకుండా ప్రస్తుత ఎన్నికల్లో బీఎస్‌ మగ్బుల్‌ అహమ్మద్‌ను బరిలో దింపారు. మళ్లీ అదే అంతర్గత పోరుసాగుతోంది. ఇలా ప్రతి ఎన్నికకు కొత్తవారిని బరిలోకి దింపడం వారు గెలిచిన తరువాత కనబడకుండా పోవడంపై వైసీపీ కార్యకర్యలతోపాటు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


నిలకడలేని వైసీపీ నాయకత్వాన్ని నమ్మి మోసపోయామని ప్రజలు విమర్శిస్తున్నారు.

కూతవేటు దూరం కోతకు ఉపయోగపడింది..!

ముఖ్యమంత్రి నియోజకవర్గం పులివెందులకు కదిరి కూత వేటు దూరంలో ఉంది. కదిరి నుంచి దాదాపు 35 కిలోమీటర్లు. అక్కడి అభివృద్ధికి ఇక్కడి అభివృద్ధికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. వందల కోట్లతో అక్కడ అభివృద్ధి జరిగితే ఇక్కడ మాత్రం కోటి రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు. ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. కదిరి మాత్రం పులివెందులలో జరిగే హత్యలకు కావలసిన మారాణాయుధాలు సరఫరా చేయడానికి ఉపయోగపడిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 07:58 AM