Share News

తిరుమల కొండను మింగే అనకొండలు: సప్తగిరి ప్రసాద్‌

ABN , Publish Date - Jun 03 , 2024 | 03:39 AM

టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కొండలను మింగే అనకొండలు తయారయ్యారు’ అని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ఆరోపించారు.

తిరుమల కొండను మింగే అనకొండలు: సప్తగిరి ప్రసాద్‌

అమరావతి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కొండలను మింగే అనకొండలు తయారయ్యారు’ అని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ఆరోపించారు. ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జగన్‌ అండ్‌ కో తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. భక్తులకు సరఫరా చేస్తున్న నీరు, ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, హెల్త్‌ ఆఫీసర్లు, పుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ మొద్దు నిద్ర వీడాలి. కేంద్ర హోం శాఖ నియమించిన కమిటీ విషయాలను బయటపెట్టే వరకు టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు’ అని మండిపడ్డారు. మరో అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ మాట్లాడుతూ, ‘సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది. కౌంటింగ్‌ తర్వాత మొదటి అరెస్టు సజ్జలతో ప్రారంభమవుతుందేమోనని భయపడుతున్నారు’ అని అన్నారు.

Updated Date - Jun 03 , 2024 | 03:39 AM