Share News

తాడిమర్రిలో తెరుచుకోని మద్యం షాపు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:08 PM

స్థానికంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం శుక్రవారం కూడా తెరుచుకోలేదు.

తాడిమర్రిలో తెరుచుకోని మద్యం షాపు
తాళం వేసిన మద్యం దుకాణం

తాడిమర్రి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : స్థానికంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణం శుక్రవారం కూడా తెరుచుకోలేదు. గురువారం సాయంత్రం దుకాణాన్ని ప్రారంభించేందుకు అసలు యజమాని కాకుండా.. అతనితో అగ్రిమెంట్‌ చేసుకున్న వ్యక్తి వచ్చాడు. దీంతో అసలు యజమాని వచ్చేంతవరకు దుకాణాన్ని తెరవకూడదని పలువురు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి శుక్రవారం ఉదయం లోపు సమస్యను పరిష్కరించుకోవాలని ఆ అగ్రిమెంట్‌దారుడిని వెనక్కు పంపారు. కాగా శుక్రవారం సాయంత్రం వరకు అగ్రిమెంట్‌దారుడు ఆ షాపు తెరిచేందుకు ముందుకు రాలేదు. షాపు వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Oct 25 , 2024 | 11:08 PM