అన్న క్యాంటీన్‌కు వృద్ధురాలి రూ.లక్ష విరాళం
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:13 AM
పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
పిఠాపురం, ఆగస్టు 23: పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో అన్న క్యాంటీన్ నిర్వహణకు విరాళాలు ఇచ్చేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా నాగ సీతమణి తన పుట్టినరోజు సందర్భంగా రూ.లక్ష విరాళాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్ వర్మ సమక్షంలో మునిసిపల్ అధికారులకు అందజేశారు. అన్న క్యాంటీన్‌లో శుక్రవారం భోజనాల ఖర్చు కూడా ఆమె ఇచ్చారు. ఈ సందర్భంగా వర్మ ఆమెను అభినందించారు. పేదవారికి కడుపునిండా అన్నం పెట్టేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.