Share News

వైభవంగా అమ్మచెరువుమిట్ట గంగమ్మ జాతర

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:23 PM

పట్టణంలోని అమ్మచెరువు మిట్టలో వెలసిన గంగమ్మ జాతర మంగళవారం రాత్రి, బుధవారం పగలు రెండు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు పేర్కొన్నారు.

వైభవంగా అమ్మచెరువుమిట్ట గంగమ్మ జాతర

మదనపల్లె అర్బన, జూన 11: పట్టణంలోని అమ్మచెరువు మిట్టలో వెలసిన గంగమ్మ జాతర మంగళవారం రాత్రి, బుధవారం పగలు రెండు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం నుంచి అమ్మవారికి ప్రత్యేకాలంకరణలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయకమిటీ సభ్యులు వై. శ్రీనివాసులు, కంచర్ల మల్లికార్జుననాయుడు, డ్యాన్సరెడ్డెప్ప, వెలుగు ఉదయ్‌మోహనరెడ్డి, రమణ, శివన్న, నాగేంద్ర, జేసీబీ శంకర, శ్రీరాములు,రమేష్‌, థనలు పర్యవేక్షించారు. స్థానిక నీరుగుట్టువారిపల్లె సమీపంలోని బాబుకాలనీలో వెలసిన బోయకొండ గంగమ్మ జాతర మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బోయకొండగంగమ్మను ప్రత్యేకంగా అలంకరణలు చేసి విశేషపూజలు నిర్వహించారు. మండలంలోని చిప్పిలి గ్రామంలో పాలేటిగంగమ్మ జాతరను రెండు రోజులపాటు అత్యంతవైభవంగా నిర్వహించారు. కురవంక సర్పంచ చిప్పిలి చలపతి ఆధ్వర్యంలో మహిళలు దీలు, బోనాలు ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

భక్తి శ్రద్ధలతో ఏనుగు మల్లమ్మకు జ్యోతులు

బి.కొత్తకోట, జూన11: ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్‌లీహిల్స్‌ లో వెలసిన ఏనుగుమల్లమ్మ జాతర కార్యక్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారికి మహిళలు భక్తిశ్రద్ధలతో జ్యోతులు మోశారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి, ఊరేగించగా ఏనుగుమల్లమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం ఎదుట భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. కొండకు దిగువన వున్న కోటావూరు, బయప్పగారిపల్లి, కాండ్లమడుగు గ్రామాలతోపాటు,హిల్స్‌ పైన వున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:23 PM