Share News

చెరుకులపాడులోకి అనుమతించండి

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:50 AM

వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామంలోకి అనుమతించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ.నాయుడు, ఈదుల వెంకటరాముడు జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డిమౌర్యను కోరారు.

చెరుకులపాడులోకి అనుమతించండి

వెల్దుర్తి, ఏప్రిల్‌, 2 : వెల్దుర్తి మండలం చెరుకులపాడుకు చెందిన 30 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామంలోకి అనుమతించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ.నాయుడు, ఈదుల వెంకటరాముడు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జాయింట్‌ కలెక్టర్‌ నారపురెడ్డిమౌర్యకు వినతి పత్రం సమర్పించారు. బీటీ నాయుడు మాట్లాడుతూ చెరుకులపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు పి.రామాంజనేయులు, బి.రామాంజనేయులు, ఎం.పెద్దయ్య, కె.రామకృష్ణ, చాకలి సుబ్బరావు 13 కుటుంబాలకు చెందిన 30 మందిని ఎమ్మెల్యే శ్రీదేవి గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు రక్షణ బాధ్యతలను విస్మరించి మాట్లాడుతున్నారన్నారు. సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఊర్లోకి రండి ఎమ్మెల్యేనే మరలా వస్తే ఊర్లోకి రావద్దండి కావాలంటే ఖర్చుల కింద రూ.50 వేలు ఇస్తాను అని సీఐ తెలిపినట్లు జేసీకి వెల్లడించారు. పోలీసుల ద్వారా రక్షణ కల్పించి మాకు ఊర్లోకి వెళ్లడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

Updated Date - Apr 03 , 2024 | 12:50 AM