Share News

Chandrababu: పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్లు ఇవేనా..?

ABN , Publish Date - Mar 07 , 2024 | 04:24 AM

టీడీపీ.. బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్లే! టీడీపీ, జనసేన కూటమిలోకి కమలం పార్టీ కూడా చేరనుంది.

Chandrababu: పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్లు ఇవేనా..?

బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు

అవసరమైతే రేపూ అక్కడే.. ఒకట్రెండు రోజుల్లోనే సీట్ల సర్దుబాటు

పవన్‌కూ పిలుపు.. తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని?

బీజేపీ గెలవగలిగే సీట్లే ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన

నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన

రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్న బీజేపీ

11 అసెంబ్లీ స్థానాలు కూడా.. బాబుతో అవగాహన

కుదిరితే రేపో, ఎల్లుండో అభ్యర్థుల ఖరారు?

ఎన్డీయేలో టీడీపీ చేరిక కూడా.. హస్తినలో

ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్‌ షా చర్చలు

అమరావతి/న్యూఢిల్లీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): టీడీపీ.. బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్లే! టీడీపీ, జనసేన కూటమిలోకి కమలం పార్టీ కూడా చేరనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించే నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం ఢిల్లీ రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆహ్వానించింది. పార్టీ నేతలు బుధవారం ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది. గురువారం ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తిన వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయేలో చేరాలని షా కోరడంతో ఆయన అంగీకరించారు. కానీ దీనిపై 2 పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తార ని అంటున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న చం ద్రబాబు.. రాత్రి బీజేసీ అగ్ర నేతలతో మంతనాలు జరుపుతా రు. అవసరమైతే శుక్రవారం కూడా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఒకట్రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. ఈ భేటీకి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ను కూడా బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్లు తెలిసింది. అయి తే ఆయన వెళ్లడం లేదని సమాచారం.

5 ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లు కోరుతున్న బీజేపీ?

పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఆంధ్రలో ఆ పార్టీకి ఒక శాతంలోపే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే.. తర్వాత గెలవలేకపోతే వైసీపీ లాభపడుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీ ట్లు ఇవ్వగా.. ఆ పార్టీ 4 చోట్లే గెలిచింది. ఈసారి విజయావకాశాలున్న అభ్యర్థులు ఉన్నచోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీ డీపీ యోచిస్తోంది. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలం, ఇంకొందరికి ప్రతికూలం గా వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు బీజేపీకివ్వాలని కొందరు టీడీపీ ముఖ్యనేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. వారు ప్రతిపాదించిన లోక్‌సభ స్థానాల్లో నరసాపురం, తిరుపతి(ఎస్సీ), అరకు(ఎస్టీ) ఉన్నాయి. అయితే బీజేపీ నేతలు 3 లోక్‌సభ సీట్లు.. నరసాపురం, రాజమహేంద్రవరం, ఏలూరు, రాజంపేట, తిరుపతి కోరుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాల్లో 5 ఎంపీ సీట్లుంటే వాటిలో 4 పొత్తులో బీజేపీకి, జనసేన(కాకినాడ)కు వెళ్తాయని, తమకు ఒకటి(అమలాపురం) మాత్రమే దక్కుతుందని.. ఇది తమకు అంగీకారం కాదని టీడీపీ నాయకుడొకరు అన్నారు. రాజంపేట ఎంపీ స్థానం పరిధిలో ముస్లింల సంఖ్యాబలం అధికమని.. అక్కడ బీజేపీకి విజయావకాశాలు తక్కువని.. పైగా తమ అసెంబ్లీ అభ్యర్థులకు కూడా ఇబ్బంది అని సీమ టీడీపీ నేతలు వాదిస్తున్నారు. అలాగే బీజేపీకి 5 అసెంబ్లీ సీట్లు ఇవ్వొచ్చని వినవస్తోంది. అయితే ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నట్లు తెలిసింది. ఆయా సీట్లు ఆశిస్తున్న బీజేపీ నేతలు పొత్తు దిశగా తమ అధినాయకత్వం వద్ద గట్టి లాబీయింగ్‌ చేస్తున్నారు. తమ వాదనకు అనుకూలంగా కొన్ని నివేదికలు సమర్పించారు. ఇక సీట్ల సర్దుబాటు ఖరారయ్యాక ఢిల్లీ పెద్దలు ఎన్టీయేలో టీడీపీ చేరికను లాంఛనంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఏపీ బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దల చర్చలు

టీడీపీతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బుధవారం ఢిల్లీలో రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపారు. రాష్ట్ర చీఫ్‌ పురందేశ్వరి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ పోటీచేసే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలపై గురువారం చంద్రబాబుతో జరిపే చర్చల్లో అవగాహనకు వస్తే.. శుక్ర, శనివారాల్లో జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పొత్తుతో పాటు అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవల పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌జీ సమక్షంలో రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పొత్తుపై చేసిన ప్రతిపాదనలపై షా, నడ్డా చర్చించినట్లు తెలిసింది.

Updated Date - Mar 07 , 2024 | 07:58 AM