Share News

ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:34 PM

పీటీఎంలోని ఆదర్శ పాఠశాలలో ఈ నెల 21 వతేదీన జరగబోవు 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శివకుమారి పేర్కొన్నారు.

ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం

పెద్దతిప్పసముద్రం ఏప్రిల్‌ 19 : పీటీఎంలోని ఆదర్శ పాఠశాలలో ఈ నెల 21 వతేదీన జరగబోవు 6వ తరగతి ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శివకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ విద్యార్థులందరూ 21న ఉదయం 9 గంటలకు ఆదర్శ పాఠశాలకు చేరుకోవాలన్నారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో పాటు మజ్జిగ బోజన వసతి ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ తరగతుల వరకు అడ్మిషన పొందవచ్చని ఆమె వివరించారు.

నిమ్మనపల్లిలో: మండలంలోని రెడ్డివారిపల్లిలో మోడల్‌ స్కూల్‌లో 6వతరగతి ప్రవే శానికి ఈ నెల 21జూ (ఆదివారం) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ సత్య నారాయణమూర్తి తెలిపారు. మండల పరిధిలోని విద్యార్థులు 5వతరగతి పాసై వుండి అనలైన ద్వారా మోడల్‌ స్కూల్‌ ప్రవేశానికి దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హజరు కావాలన్నారు. విద్యార్థులు ఆనలైన ద్వారా వారి హాల్‌టికెట్‌లను డౌనలోడ్‌ చేసుకొని పరీక్షకు హజరు కావాలన్నారు. ఆదివారం ఉదయం10గంటల నుంచి 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలలో మంచి మార్కులతో పాసైన వారిన ఎంపిక చేయన్నుట్లు తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 11:34 PM