అక్షయ పాత్ర, హరేకృష్ణ ఫౌండేషన్లకు...
ABN , Publish Date - Aug 14 , 2024 | 03:36 AM
రాష్ట్రంలో ఈ నెల 15న ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ, గోకుల క్షేత్రం నిర్మాణం కోసం భాష్యం విద్యాసంస్థలు తమ వంతు వితరణ ప్రకటించాయి.
భాష్యం విద్యాసంస్థలు రూ.కోటి వితరణ
గుంటూరు(విద్య), ఆగస్టు 13: రాష్ట్రంలో ఈ నెల 15న ప్రారంభించనున్న అన్న క్యాంటీన్ల నిర్వహణ, గోకుల క్షేత్రం నిర్మాణం కోసం భాష్యం విద్యాసంస్థలు తమ వంతు వితరణ ప్రకటించాయి. ఆయా సంస్థల నిర్వహణ కోసం రూ.కోటి చెక్కును భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తనయుడు సాకేతరామ్ మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, అక్షయపాత్ర, హరేకృష్ణ ఫౌండేషన్ నిర్వహకుల సమక్షంలో చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు రూ.50 లక్షలు, హరేకృష్ణ గోకుల క్షేత్రం నిర్మాణానికి మరో రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి విరాళాన్ని అందజేశారు.