Share News

రేపు అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం

ABN , Publish Date - May 27 , 2024 | 04:01 AM

చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ తొలిసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన అగ్నిబాన్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రయోగం మంగళవారం జరగనుంది.

రేపు అగ్నిబాన్‌ రాకెట్‌ ప్రయోగం

సూళ్లూరుపేట, మే 26: చెన్నైకి చెందిన ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ తొలిసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టదలచిన అగ్నిబాన్‌ సబ్‌ ఆర్బిటాల్‌ టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌ (సార్టెడ్‌) రాకెట్‌ ప్రయోగం మంగళవారం జరగనుంది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రయోగాన్ని ఈ నెల 28న సతీష్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌) నుంచి పూర్తి చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. షార్‌లోని ప్రైవేట్‌ ప్రయోగ వేదిక నుంచి మంగళవారం ఉదయం 5.45 గంటల నుంచి ఆరు గంటల మధ్య దీన్ని ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. సింగిల్‌ స్పేస్‌ 3డీ ప్రింటెడ్‌ ఇంజిన్‌తో ఈ రాకెట్‌ నింగిలోకి పయనమవుతోంది. అగ్నికుల్‌ కాస్మోస్‌ ఆధ్వర్యంలో ఈ చిన్న రాకెట్‌ను రూపొందించారు.

Updated Date - May 27 , 2024 | 04:01 AM