Share News

ఏడీసీసీ బ్యాంకు సీఈఓ రాజీనామా

ABN , Publish Date - May 29 , 2024 | 11:59 PM

ఏడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అవినీతి, అక్రమాల నేపథ్యంలో సీఈఓ ఏబీ రాంప్రసాద్‌ రాజీనామా చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ సహకారభవనలో నిర్వహించిన ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గ సమావేశంలో సీఈఓ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే పాలకవర్గం రాజీనామా పత్రాన్ని ఆమోదించలేదు. సర్దిచెబుతారా..? సర్దుకుంటారా..? అన్నది ఉత్కంఠగా మారింది.

ఏడీసీసీ బ్యాంకు సీఈఓ రాజీనామా
ఏడీసీసీ బ్యాంకు

ఆమోదంపై ఉత్కంఠ

అక్రమాలు, అవినీతి నేపథ్యంలోనేనా..?

ఆరు పోస్టులు అమ్ముకున్నట్లు ఆరోపణలు

బోర్డు, అధికారుల పాత్రపై అనుమానాలు

చీఫ్‌ మేనేజర్‌ వ్యవహారంపై

నిర్ణయం తీసుకోని కమిటీ

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 29: ఏడీసీసీ బ్యాంకులో జరుగుతున్న అవినీతి, అక్రమాల నేపథ్యంలో సీఈఓ ఏబీ రాంప్రసాద్‌ రాజీనామా చేశారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్‌ సహకారభవనలో నిర్వహించిన ఏడీసీసీ బ్యాంకు పాలకవర్గ సమావేశంలో సీఈఓ తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే పాలకవర్గం రాజీనామా పత్రాన్ని ఆమోదించలేదు. సర్దిచెబుతారా..? సర్దుకుంటారా..? అన్నది ఉత్కంఠగా మారింది. సీఈఓ, పాలకవర్గాన్ని అవినీతి, ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఉద్యోగ నియామకాల్లో డబ్బు భారీగానే చేతులు మారాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం జరిగిన ఉద్యోగ నియామకాల్లో 85 పోస్టులకుగాను 15 సొసైటీ ఉద్యోగులకు కేటాయించారు. ఇందులో 9 సొసైటీ ఉద్యోగులతో భర్తీ చేసి మిగిలిన 6 పోస్టులకు భారీగానే వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కో పోస్టు రూ.25లక్షలు వరకు ధర పలికినట్లు తెలుస్తోంది. ఆరు పోస్టులకుగాను రూ.1.2కోట్లు మేర సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. ఇందులో పాలకవర్గం 80శాతం వాటా, ఉన్నతాధికారులు 20శాతం పంచుకున్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఆరు పోస్టులకు ఇటు సొసైటీ ఉద్యోగులతో రూ.7.5లక్షలు పాలకవర్గం వసూలు చేసినా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో విషయం బయటకి పొక్కింది. బయట వ్యక్తులతో భర్తీ చేయడంతోనే బాధిత సొసైటీ ఉద్యోగులు ప్రభుత్వ పెద్దల దృష్టికి సమాచారాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై పోలీసు కేసు పెట్టాలనే యోచనలో బాధితులు ఉన్నట్లు ఆ బ్యాంకులో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వర్గానికి అనుకూలంగా ఒక సంఘం మరో వర్గానికి మరొక ఉద్యోగుల సంఘం మద్దతుగా వ్యవహరిస్తూ రెండుగా విడిపోయినట్లు సమాచారం. దీంతో పాలకవర్గం, ఉన్నతాధికారుల ఎదుట రెండు ఉద్యోగ సంఘాలు వారి వారి వాదనలను వినిపించాయి. సమష్టిగా పనిచేసే పరిస్థితులు లేకుండా పోయాయి.

డీజీఎం పాత్రపై చర్చ

నకిలీ పట్టాలతో రుణాలు తీసుకున్న అంశం సమావేశంలో తీవ్ర చర్చ సాగింది. ఆత్మకూరు బ్రాంచలో సుమారు 10 మందికి 2014-15లో రూ.30లక్షల మేర రుణాలు నకిలీ పట్టాలకు ఇచ్చినట్లు తేల్చారు. బ్యాంకు సూపర్‌ వైజర్‌, మేనేజర్‌, డీజీఎంలు మూడు దశల్లో పరిశీలించి రుణాలు చెల్లించారు. డీజీఎంపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆత్మకూరు బ్రాంచలో రూ.30లక్షలు నకిలీ పట్టాల రుణాల చెల్లింపు ఘటన మరింత ఊతమిస్తోంది. గతంలోనూ ఇదే డీజీఎం ప్రతి ఫైల్‌కు ఓ రేటుగా రుణాలు చెల్లించారనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఆత్మకూరు బ్రాంచ ఘటనలో డీజీఎంపై అటు బోర్డు సభ్యులు, ఇటు అధికారులు అ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పంట రుణాల చెల్లింపు ఘటనలో డీజీఎం పాత్ర ఉన్నట్లు స్వయంగా బోర్డు సభ్యులే చెప్పడం గమనార్హం.

తేలని చీఫ్‌ మేనేజర్‌ పంచాయితీ..

గత ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా జీతం తీసుకుంటున్న ఏడీసీసీ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ యర్రప్పరెడ్డి అనీల్‌కుమార్‌ రెడ్డి తాడిపత్రి అల్లర్లలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ పాలకవర్గం సమావేశంలో ఎటూ తేల్చలేకపోయారు. బోర్డు మీటింగ్‌లో ఆయన్ను సస్పెండ్‌ చేస్తారని ఉద్యోగులందరూ భావించారు. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకును నిర్వీర్యం చేస్తూ ఆర్థికంగా తీవ్ర నష్టాల్లోకి నెట్టేవిధంగా పాలకవర్గం వ్యవహరిస్తోంది, బ్యాంకును కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సొసైటీ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

గాడితప్పిన పాలన

ఐదేళ్లలో ఏడీసీసీ బ్యాంకు పాలన గాడితప్పింది. సాధారణంగా మూడేళ్లకు సీఈఓను మార్చా లి. అలా కాకుండా పాలకవర్గం తమకు అనుకూలంగా జేబులు నింపే వ్యక్తినే సీఈఓగా పెట్టుకున్నారు. దీంతో ఏడీసీసీ బ్యాంకు పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత పాలకవర్గం హ యాంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చే పట్టడం... తమ సొంత ఖజానా నింపుకోవడానికి మరింత పంట పండింది. అటు పంట రుణాల చెల్లింపుల్లోనూ రై తుల నుంచి వసూళ్లకు పాల్పడుతుండం గమనార్హం. పాలకవర్గం లోపాలపై ఽఅధికారు లు, అధికారుల తప్పులపై పాలకవర్గం సభ్యులు సమావేశంలో ఒకరిపై ఒకరూ విమర్శలు చేసుకున్నట్లు సమాచారం. అటు పాలకవర్గం, ఇటు అధికారుల నిర్వాకంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు.

Updated Date - May 29 , 2024 | 11:59 PM