అదానీ స్మార్టు మీటర్లు వచ్చేశాయ్!
ABN , Publish Date - Aug 24 , 2024 | 05:34 AM
వైసీపీ సర్కారు కొనుగోలు చేసిన స్మార్టు మీటర్లు.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ఒత్తిడితో డిస్కమ్‌లు షిర్డీసాయి,
సీపీడీసీఎల్ గోదాముకు చేరిన మీటర్లు.. నిరసన తెలిపిన సీపీఎం
అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కారు కొనుగోలు చేసిన స్మార్టు మీటర్లు.. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ఒత్తిడితో డిస్కమ్‌లు షిర్డీసాయి, అదానీ కంపెనీలకు చెందిన స్మార్ట్ మీటర్లను ఆర్డర్ చేసిన విషయం తెలిసిందే!. ఇప్పటికే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లను బిగించేందుకు వీలుగా షిర్డీసాయి మీటర్లను సరఫరా చేసేసింది. పట్టణప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్టు మీటర్లను బిగించేందుకు అదానీ నుంచి 4కంటైనర్లలో శుక్రవారం సెంట్రల్ పవర్‌డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (సీపీడీసీఎల్)కు తీసుకొచ్చారు. విషయం తెలిసి సీపీఎం కార్యవర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు మీటర్లు దిగకుండా అడ్డుకునే ప్ర యత్నం చేశారు. కాగా.. త్వరలోనే వీటిని ప్రభుత్వ కార్యాలయాలకు, తర్వాత 200యూనిట్లు పైబడి వినియోగించే వినియోగదారుల ఇళ్లకు బిగించనున్నారు.