Share News

ఆశాలను వేధిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:31 PM

కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఆశాలకు అక్రమ ్ఠంగా మెమోలు ఇస్తున్న అర్బన ప్రైమరీ హెల్త్‌సెం టర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

ఆశాలను వేధిస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలి
ధర్నా చేస్తున్న ఆశావర్కర్లు

మదనపల్లె అర్బన, ఏప్రిల్‌ 19:కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఆశాలకు అక్రమ ్ఠంగా మెమోలు ఇస్తున్న అర్బన ప్రైమరీ హెల్త్‌సెం టర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మెడికల్‌ ఆఫీసర్‌ వేధింపు లకు నిరసనగా శుక్రవారం యూపీహెచసీ ఎ దుట ఆశాకార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆశా కార్య కర్తలు నమస్కారం చేయలేదన్న కక్షతో అక్రమంగా ఆశా కార్యకర్తలపై మెమోలు జారీచేయడంతోపాటు వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టి వారిని భయభ్రాంతులకు గురి చేశాడ ని ఆరోపించారు. ఆశాలపై వేదింపులు ఉండకుండా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల పట్టించుకోని మెడికల్‌ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశాకార్యకర్తలు, యూనియన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:31 PM