శాప్ చైర్మన్, సభ్యుల రాజీనామాలు ఆమోదం
ABN , Publish Date - Jul 26 , 2024 | 03:28 AM
క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్, సభ్యులు అంతా రాజీనామా చేశారు
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): క్రీడా ప్రాధికార సంస్థ బోర్డు రద్దయింది. వైసీపీ ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చైర్మన్‌గా 15 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చైర్మన్, సభ్యులు అంతా రాజీనామా చేశారు. ఆ రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో శాప్ బోర్డు మొత్తం రద్దయింది. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని శాప్ ఎండీని ఆదేశించారు.