Share News

కరుణాకర్‌ రెడ్డి రాజీనామా ఆమోదం

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:38 AM

టీటీడీ చైర్మన్‌గా జగన్‌ హయాంలో నియమించిన భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవదాయశాఖ ఆమోదించింది.

కరుణాకర్‌ రెడ్డి రాజీనామా ఆమోదం

అమరావతి, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చైర్మన్‌గా జగన్‌ హయాంలో నియమించిన భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవదాయశాఖ ఆమోదించింది. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన మరునాడే కరుణాకర్‌రెడ్డి తన పోస్టుకు రాజీనామా చేశారు. మంగళవారం ఆయన రాజీనామాను ఆమోదిస్తూ దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 07:15 AM