అబ్దుల్ కలాం ఇప్పుడు గుర్తొచ్చారా!
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:22 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శనివారం మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు దొరికిపోయారు.

నెటిజన్ల ట్రోలింగ్‌కు దొరికిపోయిన జగన్
అమరావతి, జులై 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శనివారం మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు దొరికిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై అనేకమంది నెటిజన్లు విరుచుకుపడ్డారు. అబ్దుల్ కలాం ఇప్పుడు గుర్తుకువచ్చారా? అధికారంలో ఉన్నప్పుడు ఆయన పట్ల వ్యవహరించిన తీరు గుర్తులేదా? అంటూ వారు విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిభ అవార్డులకు ఉన్న అబ్దుల్ కలాం పేరు తొలగించి వైఎ్‌సఆర్ పేరు పెట్టినప్పుడు కలాం దేశం గర్వించే శాస్త్రవేత్త అని గుర్తుకురాలేదా? అని కొందరు నిలదీశారు. విశాఖ నగరంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పర్యాటక ఆకర్షణలో భాగంగా పేరు పెడితే దానిని పీకేసీ వైఎ్‌సఆర్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టినప్పుడు కలాం గొప్పతనం ఎక్కడికిపోయిందని మరి కొందరు ప్రశ్నించారు. ఇటువంటి చర్యలకు పాల్పడ్డ జగన్‌కు అబ్దుల్ కలాం పేరెత్తే అర్హత లేదని కొందరు వ్యాఖ్యానించారు.