Share News

యువ రైతు ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - May 16 , 2024 | 11:59 PM

ఖరీఫ్‌ ఆరంభమవుతున్న సమయంలో పంట పెట్టుబడికి డబ్బు లేక కోసిగి మండల పరిధిలోని చిర్తనకల్‌ గ్రామానికి చెందిన యువ రైతు జంగం హనుమంతరెడ్డి గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

యువ రైతు ఆత్మహత్యాయత్నం

కోసిగి మే 16: ఖరీఫ్‌ ఆరంభమవుతున్న సమయంలో పంట పెట్టుబడికి డబ్బు లేక కోసిగి మండల పరిధిలోని చిర్తనకల్‌ గ్రామానికి చెందిన యువ రైతు జంగం హనుమంతరెడ్డి గురువారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు కోసిగి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ మెరుగైన వైద్యం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. హనుమంతరెడ్డి భార్య మంగమ్మ తెలిపిన వివరాల మేరకు తమకు ఐదెకరాల పొలం ఉందని, గత ఏడాది సరైన పంటలు రాక రూ.3 లక్షల మేర అప్పు చేశామని, ఈ ఏడాది కూడా పంటకు డబ్బు లేక రోజూ మదనపడుతూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఆదోనిలో ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి కోసిగి పోలీస్‌స్టేషన్‌కు రెఫర్‌ చేశారు.

Updated Date - May 16 , 2024 | 11:59 PM