Share News

అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - May 27 , 2024 | 12:00 AM

మద్దికెరలోని కేవీరెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1987-88 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వవిద్యార్థులు సుమారు 100 మంది ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.

అపూర్వ సమ్మేళనం
సమ్మెళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు

36 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల కలయిక

మద్దికేర, మే 26: బాల్యమిత్రులు 36 ఏళ్ల కిందట విడిపోయి ఎక్కడి ఎక్కడి కో వెళ్లారు. ఉన్నత చదువులు చదివారు, కొందరు ప్రభుత్వ ప్రవేట్‌ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఇంకొద్దరు విదేశాలలో ఉన్నారు. అలాంటి వారందరూ చదువులమ్మబడికి ఆదివారం మళ్లి చేరారు. మద్దికెరలోని కేవీరెడ్డి ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1987-88 విద్యాసంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వవిద్యార్థులు సుమారు 100 మంది ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఆర్థికంగా బాగలేని మహాదేవుడు అనే విద్యార్థికి సాగి విద్యార్థి రామకృష్ణరాయల్‌ రూ. 15వేలు ఆర్థిక సాయం అందించగా మహదేవులు శాలువతో సన్మానించారు. తోటి విద్యార్థినులకు చీరలు పెట్టి సన్మానించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా గడిపి విందు ఆరగించి వీడుకోలు పలికారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

మొలగవల్లిలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ కలయిక

ఆలూరు రూరల్‌ : విద్యార్థులు జీవితంలో రాణించాలంటే ముందుచూపుతో మెలగాలని రిటైర్డ్‌ తెలుగు అధ్యాపకులు ఆంజనేయులు అన్నారు. ఆదివారం మొలగవల్లి గ్రామంలో 2000-2001 బ్యాచ్‌ విద్యార్థులు నిర్వహించిన పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వారితో పాటు ఉపాధ్యాయులు సుధాకర్‌, బాలరాజు, రేఖ ఆడమ్‌, పార్వతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం కొంచెం నిధిని పొదుపు చేసుకోవాలని, వారిని సెల్‌, టీవీలకు దూరంగా ఉంచాలని అన్నారు. అనంతరం పూర్వవిద్యార్థి కాకా రమేష్‌ కూతురు నవ్యశ్రీ భరతనాట్యంతో అలరించింది. కార్యక్రమం ముగింపులో అధ్యాపకులను విద్యార్థులు పూలమాల వేసి బహుమతులతో సత్కరించారు. అలాగే మాజీ సర్పంచు రంగస్వామి, విద్యాకమిటీ చైర్మన్‌ రామాంజనేయులును కూడా విద్యార్థులు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థులు షఫి, సుధాకర్‌, సాయి, సోము యాదవ్‌, రాధిక, యశోద, లక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 12:00 AM