Share News

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:31 PM

ప్రతి సోమవారం నగర పాలక సంస్థలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నామని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ
డ్రైనేజీని పరిశీలిస్తున్న కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు

కమిషనర్‌ ఎస్‌. రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రతి సోమవారం నగర పాలక సంస్థలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నామని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు తెలిపారు. వేదిక కార్యక్రమంలో వచ్చిన పలు ఫిర్యాదులకు సంబంధించిన ప్రాంతాలను మంగళవారం కమిషనర్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. 1వ వార్డులో చిదంబరావు వీధి, నాగమయ్యకట్ట, రాఘవేంద్ర మఠం తదితర ప్రాంతాల్లో మురుగు కాలువల సమస్యలను కమిషనర్‌ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో మురుగు కాలువల నిర్మాణం, ప్రధాన మురుగు కాలువల అనుసంధాన ప్రదేశం మార్పుల పూడికతీత పనులు చేపట్టాలని కమిషనర్‌ ఆదేశించారు. కార్యక్రమలో ఆరోగ్య అధికారి డా.కే. విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్‌ షాషావలి, ఎంఈ సత్యనారాయణ, డీఈఈ శ్రీనివాసరెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్‌ లోకేష్‌, ఏఈ స్వాతి పాల్గొన్నారు.

ఫ నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరిని నగరంలోని ఆటోనగర్‌లో నివాసంలో మంగళవారం నగర పాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కల్లూరు అర్బన సంబంధించి పలు సమస్యలపై చర్చించారు.

ఫ నగర పాలక కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ పదవీవిరమణ పొందిన అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌ డి.చక్రపాణిని కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు సన్మానించారు. నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కమిషనర్‌తో పాటు సహచర అఽధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మేనేజర్‌ చిన్నరాముడు, ఎగ్జామినర్‌ సుబ్రమణ్యం, అకౌంట్స్‌ ఆఫీసర్‌ చుండీప్రసాద్‌, ఆడిట్‌ అధికారి మురళి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:31 PM