ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా వేదిక
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:29 AM
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నా మని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

- ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఉయ్యాలవాడ, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నా మని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం స్థానిక గోల్డెన ఫంక్షన హాలులో ఎంపీడీవో ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి 113 వినతులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. ముఖ్యంగా గృహ నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషనకార్డులకు అధికంగా అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ కన్వినర్ బోరెడ్డి శేఖర్‌రెడ్డి, నాయకులు కూడాల నారాయణరెడ్డి, బోరెడ్డి నర్శిరెడ్డి, పేరెడ్డి మోహనరెడ్డి, బోరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, గోపిరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి, కొర్రపాటి నారాయణరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకటరామ సుబ్బారెడ్డి, వెంకటశివారెడ్డి, చిట్టెపు రాజగోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పల్లె బాబుల్‌రెడ్డి, మద్దూరు క్రిష్ణారెడ్డి, కర్నాటి మహేశ్వరరెడ్డి, రామ స్వామిరెడ్డి, నరేంద్రనాథరెడ్డి, నూక చంద్రశేఖర్‌రెడ్డి, గడ్డం దస్తగిరిరెడ్డి, ఆకుల చిన్న వెంకటసుబ్బయ్య, నడిపి వెంకటసుబ్బయ్య, గోతుల శేఖర్, పుల్లయ్య గౌడు, గాండ్ల వెంకటసుబ్బయ్య, భాష, వెంకటేశ్వర్లు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.