Share News

కామాంధులకు జైలు

ABN , Publish Date - May 29 , 2024 | 03:27 AM

కామంతో కళ్లు మూసుకుపోయి బాలిక పట్ల లైంగిక దాడికి పాల్పడిన ఓ వృద్ధుడికి 20ఏళ్ల జైలు శిక్ష పడగా, మరో కేసులో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది.

కామాంధులకు జైలు

బాలికపై లైంగిక దాడి కేసులో వృద్ధునికి 20 ఏళ్ల శిక్ష

అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి యావజ్జీవం

విశాఖపట్నం (లీగల్‌)/కర్నూలు(లీగల్‌), మే 27: కామంతో కళ్లు మూసుకుపోయి బాలిక పట్ల లైంగిక దాడికి పాల్పడిన ఓ వృద్ధుడికి 20ఏళ్ల జైలు శిక్ష పడగా, మరో కేసులో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి కోర్టు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. విశాఖ, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న సంఘటనల వివరాలు.... విశాఖపట్నానికి చెందిన ఓడమొదల శ్యామ్‌సుందర్‌ (70) మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉంటున్నాడు. తన ఇంటి సమీపంలో ఉంటున్న వరసకు మనవరాలైన చిన్నారి (5)పై అనేకమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 2017 అక్టోబరు ఒకటో తేదీన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను నిందితుడు తన ఇంటికి పిలిచి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక ఏడవడంతో దగ్గరలోనే ఉన్న ఆమె తల్లి వెళ్లి నిందితుడి అకృత్యాన్ని చూసి కేకలు వేసింది. మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అనంతరం పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో చార్షిషీట్‌ దాఖలు చేశారు. వాదోపవాదాల అనంతరం నేరం రుజువుకావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జి.ఆనంది సోమవారం తీర్పుచెప్పినట్టు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపారు.

నిందితుడు జరిమానాగా చెల్లించిన మొత్తాన్ని బాధితురాలికి ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, కర్నూలు జిల్లా హొళగుంద పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఒక గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికతో అదే గ్రామానికి చెందిన రంగముని అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. 2021 ఆగస్టు 13న బాధితురాలి తల్లి పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో బాలిక వాంతులు చేసుకుంటుండటంతో ఆరా తీసింది. కొ ద్ది రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికతో నిందితుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకుని హొళగుంద పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యా దు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చే సిన అప్పటి డీఎస్పీ కేఎస్‌ వినోద్‌ కుమార్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో యావజ్జీవ కఠిన కారాగారాశిక్ష, రూ.20వేలు జరిమానా విధిస్తూ కర్నూలు పోక్సో కోర్టు న్యాయాధికారి జి.భూపాల్‌ రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరపున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటేశ్వరరెడ్డి వాదించారు.

Updated Date - May 29 , 2024 | 08:35 AM