Share News

కొత్తగా రూ.4 వేల కోట్ల అప్పు

ABN , Publish Date - May 15 , 2024 | 03:25 AM

జగన్‌ సర్కారు కొత్తగా మరో రూ.4,000 కోట్ల అప్పులు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకుంది.

కొత్తగా రూ.4 వేల కోట్ల అప్పు

నెలన్నరలోనే 17 వేల కోట్ల రుణం

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారు కొత్తగా మరో రూ.4,000 కోట్ల అప్పులు తెచ్చింది. మంగళవారం ఆర్బీఐ నిర్వహించిన వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు అమ్మి ఈ రుణం తీసుకుంది. దీనిపై 7.41 నుంచి 7.45 శాతం వరకూ వడ్డీ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు వాడుకునేందుకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.47,000 కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది. అయితే మొదటి 45 రోజుల్లోనే జగన్‌ ప్రభుత్వం ఒక్క ఆర్‌బీఐ నుంచి రూ.17వేల కోట్ల చేబదులు తెచ్చి వాడేసింది. ఇంకా రూ.30వేల కోట్ల అప్పుల పరిమితి మిగిలి ఉంది.

Updated Date - May 15 , 2024 | 03:25 AM