Share News

క్రిస్మస్‌కు చర్చిల ముస్తాబు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:38 PM

గ్రామాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాలను క్రిస్మస్‌ వేడుకలకు నిర్వాహకులు ముస్తాబు చేశారు.

క్రిస్మస్‌కు చర్చిల ముస్తాబు
విద్యుతదీపాలతో ముస్తాబు అయిన డోన వెఎౖస్‌ నగర్‌లో బైబిల్‌ మిషన చర్చి

కొలిమిగుండ్ల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొలిమిగుండ్ల, బెలుం, కనకాద్రిప ల్లె, తిమ్మనాయినిపేట, అబ్దులాపురం, కల్వటా ల, తుమ్మలపెంట తదితర గ్రామాల్లోని చర్చిలు, ప్రార్థనా మందిరాలను క్రిస్మస్‌ వేడుకలకు నిర్వాహకులు ముస్తాబు చేశారు. విద్యుత దీపాల అలంకరణతో చర్చిలను అలంకరించారు.

డోన రూరల్‌: పట్టణంలోని వైఎస్‌ నగర్‌లో ఉన్న చర్చిలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. బైబిల్‌ మిషన ఏవో రేనా బందే రాజు ఆధ్వర్యంలో జరిగిన సెమి క్రిస్మస్‌ వేడుకల్లో క్రిస్మస్‌ సందేశాన్ని వినిపించారు. సెమి క్రిస్మస్‌ సందర్భంగా చర్చిని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం క్యాండిల్‌ లైటింగ్‌ సర్వీసు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బైబిల్‌ మిషన సంఘ సేవకులు బి.మణిరాజ్‌, సభ్యులు దైవవరం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:38 PM