Share News

టీటీడీ ‘ట్రాన్స్‌పోర్టు’లో భారీ కుంభకోణం

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:22 AM

టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు స్కామ్‌ జరిగిందని తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు.

టీటీడీ ‘ట్రాన్స్‌పోర్టు’లో భారీ కుంభకోణం

ఆ విభాగంలో వైఎ్‌సఆర్‌ జమానా నుంచీ ఓ రెడ్డిదే హవా

ట్రావెల్స్‌కూ వాహనాలు..! : కిరణ్‌ రాయల్‌

తిరుపతి (జీవకోన), జూలై 29: టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో దాదాపు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు స్కామ్‌ జరిగిందని తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్‌ రాయల్‌ ఆరోపించారు. సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వైసీపీ ప్రభుత్వం నడిచిన ఐదేళ్ల కాలంలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో పుష్కలంగా దోచేసింది. ఈవోలు, జేఈవోలు, చైర్మన్లు, బోర్డు మెంబర్లు ఎంతమంది మారినా ట్రాన్స్‌పోర్టు విభాగంలో జనరల్‌ మేనేజర్‌గా వున్న ఓ రెడ్డి హవానే నడుస్తోంది. వైఎస్‌ సీఎంగా వున్నప్పటినుంచీ ఆ పదవిలో ఆయన కొనసాగుతుండడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. వాహనాలను ఇష్టానుసారం వాడుతూ నిధులను నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. దీనిపై మావద్ద పూర్తి సమాచారం ఉంది. వాహనాలను ట్రావెల్స్‌కు ఏమైనా తిప్పుతున్నారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది అధికారులు వారి జల్సాలకు ఇష్టానుసారంగా వాహనాలను వాడుకుంటున్నారు. అదే విఽధంగా టీటీడీ తిరుమల రెవెన్యూ విభాగంలో ఓ అధికారే పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. ఏ చైర్మన్‌ వచ్చినా ఆయనే సూపరింటెండెంట్‌గా ఉంటారు. దీని వెనుక మతలబు అర్థం కావడంలేదు’ అని కిరణ్‌ అన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 08:07 AM