Share News

పాఠ్య పుస్తకాల ముద్రణలో భారీ స్కామ్‌!

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:28 AM

పాఠ్య పుస్తకాల ముద్రణ టెండర్లకూ వైసీపీ అవినీతి చీడ పురుగులు పట్టాయని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ‘

పాఠ్య పుస్తకాల ముద్రణలో భారీ స్కామ్‌!

రూ.120కోట్ల ప్రజాధనం దోపిడీకి స్కెచ్‌: టీడీపీ నేత పట్టాభి

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పాఠ్య పుస్తకాల ముద్రణ టెండర్లకూ వైసీపీ అవినీతి చీడ పురుగులు పట్టాయని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ‘2022లో పేపర్‌ ధర టన్ను రూ.లక్ష ఉన్నప్పుడు ఒక్కో పేజీ ముద్రణతో కలిపి 23పైసలుగా నిర్ణయించగా, ప్రస్తుతం పేపర్‌ ధర తగ్గినా, ఒక్కో పేజీకి ముద్రణతో 34.2పైసలుగా జగన్‌ సర్కార్‌ ధర నిర్ణయించింది. 4.78కోట్ల పుస్తకాలు, 739.58కోట్ల పేజీల ముద్రణకు రూ.253కోట్లకు టెండర్‌ పెట్టారు. తగ్గిన పేపర్‌ ధర ప్రకారం పాఠ్య పుస్తకాల ఖర్చు రూ.155కోట్లు మాత్రమే అవుతుంది. కానీ టెండర్‌ రేటు పెంచి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి, రూ.120 కోట్లు కాజేసేందుకు విద్యామంత్రి బొత్స భారీ స్కామ్‌కు తెరలేపారు’ అని ఆరోపించారు. ఇదంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని, ఇందులో మంత్రి సత్తిబాబు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌, సీఎంవో కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి ముఖ్య భూమిక పోషించారని ఆరోపించారు.

Updated Date - Feb 12 , 2024 | 02:28 AM