Share News

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతన్న

ABN , Publish Date - May 15 , 2024 | 11:17 PM

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముందుగాను వచ్చింది. సోమవారం తెల్లవారుజామున కురుసిన వర్షం కారణంగా మండలంలో ఖరీఫ్‌ సాగుకు రైతన్నలు సిద్ధయ్యారు.

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతన్న
పంట సాగుకు వేరుశనగ విత్తనాలను సిద్ధం చేస్తున్న మహిళా రైతులు

14వేల హెక్టార్‌ లో పత్తి, ఉల్లి, వేరుశనగ, కంది సాగుకు సిద్ధం

గోనెగండ్ల, మే 15: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముందుగాను వచ్చింది. సోమవారం తెల్లవారుజామున కురుసిన వర్షం కారణంగా మండలంలో ఖరీఫ్‌ సాగుకు రైతన్నలు సిద్ధయ్యారు. మహిళా రైతులు వేరుశగన విత్తనాలు విత్తేందుకు గాను విత్తనాలను సిద్ధం చేసున్నారు. సోమవారం 53.4 ఎంఎం వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం పనులు మొదలు పెట్టారు. బావులు, బోర్ల దగ్గర ముందస్తు పొలం పనులు పూర్తి చేసుకున్న రైతులు పత్తి, ఉల్లి, పంటల సాగుచేస్తున్నారు. మండలంలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 14వేల హెక్టార్‌లలో పత్తి, మేరుశనగ, ఉల్లి, కంది, పంటలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా పత్తి, ఉల్లి, వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. గోనెగండ్ల, అలువాల, గాజులదిన్నె, హెచ్‌ కైరవాడి, కులుమాల, గంజహళ్లి పెద్దనేలటూరు, పెద్దమరివీడు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఇప్పటికే పొలం పనులు మొదలు పెట్టారు.

Updated Date - May 15 , 2024 | 11:17 PM