పట్టు నిలుపుకున్న కూటమి
ABN , Publish Date - May 12 , 2024 | 12:34 AM
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదోనిలో చేపట్టిన ప్రజాగళం ఎన్నికల ప్రచారం విజయవంతం అయింది.

జేపీ నడ్డా సభ విజయవంతం
భారీగా తరలివచ్చిన టీడీపీ-బీజేపీ-జనసేన కార్యకర్తలు
ఆదోని (అగ్రికల్చర్), మే 11: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదోనిలో చేపట్టిన ప్రజాగళం ఎన్నికల ప్రచారం విజయవంతం అయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జన సమీకరణలో తమ పట్టుని నిలుపుకుంది. గ్రామాల నుంచి పట్టణంలోని ఆయా వార్డుల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మున్సిపల్ క్రీడా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభ మైదానమంతా పసుపు, కాషాయపు, జనసేన జెండాలతో రెపరెపలాడింది. అసెంబ్లీ అభ్యర్థి పార్థసారధి, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటు నాగరాజు కార్యక్తలను చూసి ఉప్పొంగి పోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మైదానంలోని కార్యకర్తలను చూసి తన ప్రసంగంలో విజయం ఖాయమని మెజారిటీనే తేలాలని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, ఆదోనిలో బీజేపీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీ రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎన్డీఏ అభ్యర్థి కమలం గుర్తుకే ఓటు వేయించాలని సూచించారు.