తాడికొండ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
ABN , Publish Date - Sep 27 , 2024 | 03:41 AM
అమరావతి రాజధాని ఐనవోలు పరిధిలో ఉన్న వీఐటీ (వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థిని సాయిశ్రీయ ఆత్మహత్య విషయం గురించి తె లుసుకోవడానికి వెళ్లిన తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్‌కు గురువారం సాయంత్రం చేదు అనుభవం ఎదురైంది.
వీఐటీలోకి వెళ్లకుండా అడ్డుకున్న సెక్యూరిటీ
తుళ్లూరు, సెప్టెంబరు 26: అమరావతి రాజధాని ఐనవోలు పరిధిలో ఉన్న వీఐటీ (వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థిని సాయిశ్రీయ ఆత్మహత్య విషయం గురించి తె లుసుకోవడానికి వెళ్లిన తాడికొండ శాసన సభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్‌కు గురువారం సాయంత్రం చేదు అనుభవం ఎదురైంది. వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్ద ఆయన్ను అడ్డుకున్నారు. ఎవరైనా సరే లోపలికి వెళ్లడానికి అనుమతుల్లేవని చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. ఎమ్మెల్యేకే లోపలికి వెళ్లడానికి అవకాశం లేదంటే ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని యాజమాన్యంపై శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులను ఎందుకు లోపలికి అనుమతించడం లేదని ప్రశ్నించారు. అనంతరం వర్సిటీ లోపలికి వెళ్లిన శ్రావణ్ కుమార్ విద్యార్థిని మృతికి గల కారణాలను వైస్ చాన్సలర్ కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీశ్ ముదిగంటిని అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.