Share News

UPSC : సీఎస్‌ ఆత్రానికి అడ్డుకట్ట!

ABN , Publish Date - May 31 , 2024 | 03:52 AM

అస్మదీయులకు ఐఏఎస్‌ ఇప్పించుకోవాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి ఆత్రానికి యూపీఎస్సీ అడ్డుకట్ట వేసింది.

UPSC : సీఎస్‌ ఆత్రానికి అడ్డుకట్ట!

‘కన్ఫర్డ్‌ ఐఏఎస్‌’ ఇంటర్వ్యూలు 25న

కొత్త తేదీని ప్రకటించిన యూపీఎస్సీ

అస్మదీయులకు పోస్టులు కట్టబెట్టే యత్నాలకు చెక్‌

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): అస్మదీయులకు ఐఏఎస్‌ ఇప్పించుకోవాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌స.జవహర్‌రెడ్డి ఆత్రానికి యూపీఎస్సీ అడ్డుకట్ట వేసింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఇప్పట్లో ఇంటర్వ్యూల నిర్వహణ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జూన్‌ 25న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సమాచారం ఇచ్చింది. తమవాళ్లు ఇద్దరికి కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ పోస్టులు దక్కేలా చేసేందుకు కొన్ని నెలలుగా జవహర్‌రెడ్డి పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఇప్పటికే గతేడాది నాన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ కోటాలో తమ వారిద్దరికి ఐఏఎస్‌ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన రెండు నాన్‌ రెవెన్యూ ఐఏఎస్‌ పోస్టులు కూడా తమవారికే వచ్చేలా విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 7న కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలి. ఈ తేదీని యూపీఎస్సీ రెండు నెలల కిత్రమే నిర్ణయించింది. ఫలితాలు వచ్చేలోగా తమవారిని ఐఏఎ్‌సలు చేసేద్దామని సీఎస్‌ భావించారు. ముందుగా నిర్ణయించిన తేదీని మార్చాలంటూ కమిషన్‌కు సీఎస్‌ లేఖ రాశారు. ఏయే తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించాలో కూడా ఆయనే సూచించారు. మే 30 లేదా 31వ తేదీనే పూర్తి చేసేద్దామని లేఖలో పేర్కొన్నారు. జూన్‌ 4న ఎన్నికల కౌంటింగ్‌ ఉంటుందని, ఆ తర్వాత రెండురోజుల పాటు షెడ్యూల్‌ బిజీగా ఉంటుంది కాబట్టి 7న నిర్వహించే ఇంటర్వ్యూలకు తాను రాలేకపోవచ్చని తెలిపారు. ఆ లేఖను పరిశీలించిన యూపీఎస్సీ... జూన్‌ 6 వరకూ కోడ్‌ అమలులో ఉంటుంది కాబట్టి మేలో ఇంటర్వ్యూలు చేయడం కుదరని చెప్పడంతో ఆయన కిక్కురుమనలేదు. తాజాగా ఇంటర్య్వూల తేదీ నిర్ణయిస్తూ జవహర్‌ రెడ్డికి యూపీఎస్సీ లేఖ రాసింది. 7న నిర్వహించాల్సిన ఇంటర్వ్యూలను పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని తెలిపింది. జూన్‌ 25న ఉదయం 10.30 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించింది. కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ సమాచారం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సెలక్షన్‌ కమిటీలో ఉన్న సభ్యులకు, డీవోపీటీకి కూడా లేఖలు వెళ్లాయి. ఆ రోజున ఇద్దరు జాయింట్‌ సెక్రటరీ కేడర్‌ అధికారులను పంపించాలని లేఖలో పేర్కొన్నారు.

Updated Date - May 31 , 2024 | 06:17 AM