Share News

ఖాతాల్లోకే 73 శాతం పెన్షన్లు

ABN , Publish Date - May 30 , 2024 | 02:06 AM

జూన్‌ నెల ఒకటో తేదీని పంపిణీ చేయనున్న సామాజిక పెన్షన్లలో 73.11 శాతం బ్యాంకు ఖాతాల ద్వారానే పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.

ఖాతాల్లోకే 73 శాతం పెన్షన్లు

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): జూన్‌ నెల ఒకటో తేదీని పంపిణీ చేయనున్న సామాజిక పెన్షన్లలో 73.11 శాతం బ్యాంకు ఖాతాల ద్వారానే పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ‘కోడ్‌ అమల్లోఉన్న నేపథ్యంలో మే 1న పెన్షన్‌ను డీబీటీ, డోర్‌ టు డోర్‌ అనే రెండు విధానాల్లో పంపిణీ చేశాం. జూన్‌లో కూడా అదేవిధంగా పంపిణీ చేస్తాం. 47.74లక్షల మందికి డీబీటీ విధానంలో వారి ఖాతాల్లో వేయనున్నాం. 17.56 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారు’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2024 | 07:49 AM