ఉపాధి పనుల్లో రూ.68 వేల అవినీతి
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:39 AM
సామాజిక తనిఖీ ప్రజా వేదికను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 703 పనులను రూ.6.92 కోట్లతో చేపట్టగా.. అందులో రూ.68,693 మాత్రమే అవినీతి జరిగిందని, రికవరీకి ఆదేశించామని అధికారులు తెలిపారు.
తాడిమర్రి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : సామాజిక తనిఖీ ప్రజా వేదికను స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 703 పనులను రూ.6.92 కోట్లతో చేపట్టగా.. అందులో రూ.68,693 మాత్రమే అవినీతి జరిగిందని, రికవరీకి ఆదేశించామని అధికారులు తెలిపారు. గత ఏడాది రామాపురం గ్రామంలో ఎలాంటి అవినీతి జరగలేదని అధికారులు క్లీన చిట్ ఇచ్చారు. అయితే 10 ఏళ్ల క్రితమే చనిపోయిన వారి ఖాతాల్లో కూడా డబ్బులు పడ్డాయని అఽధికారులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ విచారణ చేపట్టారు. దీంతో రూ.కోటికి పైగా అవినీతి జరిగినట్టు లెక్కలు వేశారు. ఈ సారి కూడా రామాపురం గ్రామంలో కేవలం రూ.19,608 మాత్రమే అవినీతి జరిగిందని అధికారులు చెబుతుండటంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల సైతం పాత క్షేత్రసహాయాకులను కాపాడే ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ వారిమీద మచ్చ పడనీయడం లేదని ఆరోపి స్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స అధికారి రమణా రెడ్డి, ఏపీడీ వెంకటాచలపతి, అంబుర్డ్స్‌మెన శివశంకర్‌రెడ్డి, ఎంపీడీఓ రంగారావు, ఏపీఓ సంజీవరెడ్డి, ఎస్‌ఆర్‌పీ తిరుమలేశ, సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.