Share News

దివ్యాంగులకు 6వేల పెన్షన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Mar 10 , 2024 | 03:15 AM

రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని, వారి సమస్యలు పరిష్కారమయ్యేవరకు, వారి హక్కులు వారికి దక్కేవరకు వారి పోరాటాన్ని తాము భుజాన వేసుకుంటామని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.

దివ్యాంగులకు 6వేల పెన్షన్‌ ఇవ్వాలి

చలో అమరావతి సభలో మందకృష్ణ

పెదకాకాని, మార్చి 9: రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదని, వారి సమస్యలు పరిష్కారమయ్యేవరకు, వారి హక్కులు వారికి దక్కేవరకు వారి పోరాటాన్ని తాము భుజాన వేసుకుంటామని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. చలో అమరావతి -వికలాంగుల మహాగర్జన పిలుపులో భాగంగా శనివారం ఆచార్య నాగార్జున వర్సిటీ ఎదురుగాగల గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న విభిన్న ప్రతిభావంతులకు పెన్షన్‌ నెలకు రూ. 6వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. వారికి అవసరమైన వాహనాలను సమకూర్చాలన్నారు. టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. జగన్‌ ఒక మానసిక వికలాంగుడని, అతడు దివ్యాంగుల హక్కులను హరించి వేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దివ్యాంగుల కష్టాలన్నీ తీరుస్తామని, అందుకోసం ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు మాట్లాడారు.

Updated Date - Mar 10 , 2024 | 03:16 AM