Share News

60 కేజీలకు గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:01 AM

గుంటూరుకు సమీపంలోని పొత్తూరు వద్ద జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు చేసి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, బెంగళూరుకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.

60 కేజీలకు గంజాయి పట్టివేత

ముగ్గురు బెంగుళూరువాసుల అరెస్టు: ఎస్పీ వెంకటేశ్వరరావు

గుంటూరు (కార్పొరేషన్‌), జనవరి 29: గుంటూరుకు సమీపంలోని పొత్తూరు వద్ద జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు చేసి 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, బెంగళూరుకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం ఎస్‌ఈబీ టూటౌన్‌ ేస్టషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. బెంగళూరులో చెత్త కాంట్రాక్ట్‌ పనులు చేస్తూ గంజాయి మత్తుకు అలవాటు పడ్డ కిషోర్‌ పాలక్షరెడ్డి సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో తనతోపాటు గంజాయి ేసవించే తన ేస్నహితులైన అభినయ్‌ సుద్దగుంట పాల్య వెంకటేష్‌, సుమంత్‌ కుమార్‌లతో కలసి ఒడిసాలోని కోరాఫుట్‌ జిల్లా అరగొండ గ్రామం నుంచి 60 కేజీల గంజాయి తీసుకొచ్చి అధిక రేటుకు అమ్ముకోవాలని భావించారు. ఈ క్రమంలో ఒడిసా నుంచి గంజాయిని కొనుగోలు చేసి రెండు కార్లలో బెంగళూరు బయలుదేరారు. గుంటూరు శివారులో హైవేపై అధికారులు తనిఖీలు చేస్తుండగా వీరు పట్టు పడ్డారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద 60 కేజీల గంజాయి, ఏడు మొబైల్‌ ఫోన్స్‌, రెండు కార్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 30 , 2024 | 03:01 AM