శ్రీకాకుళంలో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్
ABN , Publish Date - Oct 25 , 2024 | 04:13 AM
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ఆధునీకరణ, అభివృద్థికి కేంద్రప్రభుత్వం రూ.252.42 కోట్ల నిధులు మంజూరు చేసింది.

రణస్థలం వద్ద 252.42 కోట్లతో ఏర్పాటు: గడ్కరీ
న్యూఢిల్లీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ ఆధునీకరణ, అభివృద్థికి కేంద్రప్రభుత్వం రూ.252.42 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, రహదారి భద్రత మెరుగవుతుందని చెప్పారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఏఐతో చెక్: గడ్కరీ
ట్రాఫిక్ ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేయడానికి, జరిమానాలను కచ్చితంగా విధించేలా చూడటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర వినూత్న పద్ధతులు ఉపయోగించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ట్రాఫిక్ ఇన్‌ఫ్రా టెక్ ఎక్స్‌పో 12వ ఎడిషన్‌ను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులు, చట్టాల అమలు, ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోకుండా రోడ్డు భద్రతను సాధించలేమని పేర్కొన్నారు.