Share News

రూ.6కోట్ల బంగారం, వెండి సీజ్‌

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:52 AM

సరైన బిల్లులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులను సీజ్‌ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు రావులపాలెం సీఐ ఆంజనేయులు తెలిపారు.

రూ.6కోట్ల బంగారం, వెండి సీజ్‌

రావులపాలెం, ఏప్రిల్‌ 29: సరైన బిల్లులు లేకుండా వాహనాల్లో తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులను సీజ్‌ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు రావులపాలెం సీఐ ఆంజనేయులు తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎ్‌సటీ ఇన్‌చార్జ్‌, రావులపాడు కార్యదర్శి పట్టాభిరామయ్య, సీఐ ఆంజనేయులు సిబ్బందితో సోమవారం వాహనాలు తనిఖీచేస్తున్నారు. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్‌ వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో రూ.6,70,16,362 విలువైన 9.530కిలోల బంగారు ఆభరణాలు, 18.71గ్రాముల వెండి వస్తువులను గుర్తించారు. సరైన బిల్లులు చూపకపోవడంతో వాటిని సీజ్‌ చేసి ఐటీ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 07:30 AM