Share News

అంగన్వాడీలకు 52 కోట్లు: మంత్రి సంధ్యారాణి

ABN , Publish Date - Dec 19 , 2024 | 05:00 AM

రాష్ట్రంలోని 11,003 అంగన్వాడీ కేంద్రాలకు రూ.52.68 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇందులో తాగునీటి సౌకర్యానికి రూ.19.39కోట్లు,

అంగన్వాడీలకు 52 కోట్లు: మంత్రి సంధ్యారాణి

అమరావతి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 11,003 అంగన్వాడీ కేంద్రాలకు రూ.52.68 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇందులో తాగునీటి సౌకర్యానికి రూ.19.39కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ33.29 కోట్లు కేటాయించినట్లు స్పష్టం చేశారు. 7387 అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్‌ కోసం సీఎండీలకు లేఖలు రాసినట్లు తెలిపారు. అల్లూరి, ఏలూరు, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేకంగా బలహీన గిరిజన సమూహాల(పీవీటీజీ) కోసం పీఎం జన్‌మన్‌ కింద 139 కొత్త అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించామని పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 05:00 AM