బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు మాయం
ABN , Publish Date - May 19 , 2024 | 03:15 AM
కర్నూలు జిల్లాలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు కొట్టేశారు.
ఫోన్ హ్యాక్ చేసి నగదు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఎమ్మిగనూరు, మే 18: కర్నూలు జిల్లాలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తాజాగా ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామానికి చెందిన షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5 లక్షలు కొట్టేశారు. ఇబ్రహీం ఎమ్మిగనూరులో యునియన్ బ్యాంకుకు చెందిన బీసీ పాయింట్ (బిజినెస్ కరస్పాండెంట్) నిర్వహిస్తున్నాడు. ఇందులో బాగంగా శుక్రవారం ఎమ్మిగనూరు బ్యాంకుకు వచ్చిన సమయంలో తన సెల్‌ఫోన్‌ను హ్యాక్ చేసి ఈ బ్యాంకింగ్ ద్వారా ఇతర ఖాతాలకు సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసుకున్నట్టు బాధితుడు తెలిపాడు. ఎమ్మిగనూరు పట్టణ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసి ఆ వివరాలను అందించాడు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.