Share News

సాగు అనుబంధానికి 43,402 కోట్లు

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:29 AM

వ్యవసాయ, అనుబంధ రంగాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త బడ్జెట్‌లో వీటికి రూ.43,402.33 కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్‌ను

సాగు అనుబంధానికి 43,402 కోట్లు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, అనుబంధ రంగాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త బడ్జెట్‌లో వీటికి రూ.43,402.33 కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ శాఖల బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శాసనమండలిలో మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.4,500 కోట్లు ప్రతిపాదించారు. పంటల బీమాకు 1,023 కోట్లు, ఉద్యానం 3,469 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,095 కోట్లు కేటాయించారు. జగన్‌ సర్కారు 2023-24లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.41,436.29 కోట్లతో బడ్జెట్‌ పెట్టగా.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం రూ.1,966.04 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. వ్యవసాయ విద్యుత్‌ రంగానికి గతేడాది బడ్జెట్‌లో రూ.5,500 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత ప్రభుత్వం రూ.7,241.30 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా ఉపాధి హామీ పథకం అమలుకు గత ప్రభుత్వం రూ.5,100 కోట్లు కేటాయించగా.. కూటమి సర్కారు రూ.5,150 కోట్లు ప్రతిపాదించింది. ఉద్యాన, పశుసంవర్ధక, మార్కెటింగ్‌, సహకార, మత్స్చ శాఖలకు, పట్టుపరిశ్రమకు కూడా కేటాయింపులు పెరిగాయి.

Updated Date - Nov 12 , 2024 | 05:29 AM