Share News

ఏపీలో 42,518 మంది ఆశా వర్కర్లు: కేంద్రం

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:32 AM

సాగు విద్యుత్‌పై రైతుకు పూర్తి స్చేచ్ఛ ఇవ్వాలని ఇంధన శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఏపీలో 42,518 మంది ఆశా వర్కర్లు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 42,518 మంది ఆశావర్కర్లు ఉన్నారని కేంద్రం స్పష్టం చేసింది. శుక్రవారం, లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జిల్లాల వారీగా ఆశావర్కర్ల నియమాకానికి సంబంధించిన వివరాలు కేంద్రం వద్ద ఉండవని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఆశావర్కర్లు కంటి, ఈఎన్‌టీ, అత్యవసర వైద్య సేవలు, ప్యాలియేటివ్‌ కేర్‌ వంటి వాటిలో శిక్షణ పొందినట్లు తెలిపారు.

Updated Date - Aug 03 , 2024 | 03:59 AM