Share News

వేలం పాట ద్వారా మల్లయ్యకొండకు రూ.3,83,500 ఆదాయం

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:16 AM

తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ ఆలయానికి ప్రవేశించు వాహనాల టోల్‌ గేట్‌ రుసుము వసూలు చేసుకొను హక్కును పొందడానికి వేలం పా ట ద్వారా మల్లయ్యకొండకు రూ.3,83,500లు ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ తెలిపారు.

వేలం పాట ద్వారా మల్లయ్యకొండకు రూ.3,83,500 ఆదాయం

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 12: తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ ఆలయానికి ప్రవేశించు వాహనాల టోల్‌ గేట్‌ రుసుము వసూలు చేసుకొను హక్కును పొందడానికి వేలం పా ట ద్వారా మల్లయ్యకొండకు రూ.3,83,500లు ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ తెలిపారు. సోమవారం మల్లయ్యకొండపైన ఆలయం వద్ద ఆలయ ఽచైర్మన కేఆర్‌మల్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వాహనాల టోల్‌గేట్‌కు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో తంబళ్లపల్లెకు చెందిన శేఖర్‌ రూ.3,83,500లు పాడి టోల్‌గేట్‌ రుసుము వసూలు హక్కును దక్కిం చుకున్నారు. కాగా, మల్లయ్యకొండ పనులకు సంబంధించి గత నెల 20న నిర్వహించిన బహిరంగ వేలం పాటల ద్వారా రూ.15,04,500లు ఆదాయం వచ్చింది. దీంతో మల్లయ్యకొండకు ఈ ఏడాది వేలం పాటల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.18,88,000లు చేరింది. కార్యక్ర మంలో ధర్మకర్త మండలి సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, ఆర్బీకే చైర్మన రెడ్డిమ ల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:16 AM