Share News

ఏపీఈఏపీసెట్‌కు 3,61,640 దరఖాస్తులు

ABN , Publish Date - May 15 , 2024 | 03:08 AM

ఏపీ, తెలంగాణలోని రెండు కేంద్రాల్లో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 23వ వరకూ నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌కు ఇప్పటివరకూ 3,61,640 దరఖాస్తులు వచ్చినట్టు సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉప కులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు.

ఏపీఈఏపీసెట్‌కు 3,61,640 దరఖాస్తులు

16 నుంచి 23 వరకూ పరీక్షలు

కాకినాడ (జేఎన్టీయూకే), మే 14: ఏపీ, తెలంగాణలోని రెండు కేంద్రాల్లో కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 23వ వరకూ నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌కు ఇప్పటివరకూ 3,61,640 దరఖాస్తులు వచ్చినట్టు సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉప కులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం ఆయన అధికారులు, సెట్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో వర్సిటీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ మొత్తం 49 ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పరీక్షల హాల్‌టికెట్లను ఈ నెల 7న విడుదల చేశామని.. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదుచేసి హాల్‌టికెట్లను పొందవచ్చని తెలిపారు. అగ్రికల్చర్‌ ఫార్మసీ పరీక్షలు 16 నుంచి 17వరకూ, ఇంజనీరింగ్‌ పరీక్షలు 18 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని హాల్‌టికెట్లను జ్ట్టిఞట:// ఛ్ఛ్టిట.్చఞటఛిజ్ఛి.్చఞ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనర్‌ కె.వెంకటరెడ్డి సూచించారు. విద్యార్ధులకు ఏమైనా సందేహాలుంటే 0884-2342499, 2359599 నంబర్లలలో కానీ జ్ఛిజూఞఛ్ఛీటజ్చుఞ్ఛ్చఞఛ్ఛ్టిః్చఞటఛిజ్ఛి.ౌటజ మెయిల్‌ ఐడీ ద్వారా కానీ సంప్రదించాలని తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 07:50 AM