జీజీహెచలో వసతులకు రూ.3 కోట్లు
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:36 PM
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా రూ.3 కోట్ల గ్రాంట్ మంజూరైనట్లు కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు.

కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏపీఎంఎ్‌సఐడీసీ ద్వారా రూ.3 కోట్ల గ్రాంట్ మంజూరైనట్లు కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన సర్వజన వైద్యశాలలో పలు విభాగాలను పరిశీలించారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ.3 కోట్లతో సివిల్ వర్క్, డ్రైనేజీ మరమ్మతులు, ఎలక్ర్టికల్ వర్క్ ద్వారా ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గైనిక్ విభాగం ఫార్మసీ (నెంబర్.13)లో బాతరూమ్‌ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ శివకుమార్‌ను ఆదేశించారు. గైనిక్ విభాగంలో ఏఎనఎం, సెక్యూరిటీ, శానిటేషన సిబ్బంది ప్రసవం కోసం వచ్చే వారి నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తక్షణమే ఆసపత్రి ఆవరణలో డ్రైనేజీ మరమ్మతులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఇంజనీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డా.సీతారామయ్య, హాస్పిటల్ అడ్మినిస్ర్టేటర్ పి.సింధూ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ సీఎ్‌సఆర్‌ఎంవో డా.బి.హేమనళిని పాల్గొన్నారు.