Share News

25 పార్లమెంటు స్థానాలు.. 10 మంది బాధ్యులు

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:09 AM

రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు 10 మంది పార్టీ ముఖ్య నాయకుల్ని ఇన్‌చార్జిలుగా బీజేపీ నియమించింది.

25 పార్లమెంటు స్థానాలు.. 10 మంది బాధ్యులు

ఖరారు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలకు 10 మంది పార్టీ ముఖ్య నాయకుల్ని ఇన్‌చార్జిలుగా బీజేపీ నియమించింది. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓ ప్రకటన చేశారు. ‘ఉత్తరాంధ్రలోని అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లికి పీవీఎన్‌ మాధవ్‌తోపాటు సీతారామాంజనేయ చౌదరి ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తారు. ఉభ య గదావరి జిల్లాల్లోని కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరుకు కాశీ విశ్వనాథ రాజుతోపాటు కోడూరి లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నర్సరావుపేటకు శ్రీనివాసరాజుతో పాటు మట్టా ప్రసాద్‌... ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేటకు దయాకర్‌ రెడ్డితోపాటు సామంచి శ్రీనివా్‌సను ఇన్‌చార్జిలుగా నియమిస్తున్నాం. కడప, హిందూపురం, అనంతపురం, కర్నూలు, నంద్యాలకు బిట్ర శివన్నారాయణ, యాల్లారెడ్డి బాధ్యులుగా వ్యవహరిస్తారు’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 08:58 AM