Share News

వైసీపీ నుంచి 150 కుటుంబాలు టీడీపీలో చేరిక

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:05 AM

నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆదివారం టీడీపీ ఇన్‌చార్జీ, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీ నుంచి 150 కుటుంబాలు టీడీపీలో చేరిక

ఆదోని, జూన్‌ 16: నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆదివారం టీడీపీ ఇన్‌చార్జీ, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మీనాక్షినాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కౌన్సిలర్‌ అంజని, ఎంఎం కాలనీ నుంచి వేణు కుమారులు రామయ్య, వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర, గిరి, శివశంకర్‌, చరణ్‌, అంజయ్య, రవికుమార్‌, నాగలాపురం గ్రామం నుంచి వెంకటేష్‌, జనార్ధన్‌, చిన్న వీరేష్‌, పెద్ద వీరేష్‌, శ్రీనివాసులు, తిమ్మప్ప, చిన్ని రామాంజనేయులు, పెద్ద ఊరుకుందు, మోహన్‌, వెంకటరాముడు, గోవిందుతోపాటు మరికొన్ని కుటుంబాలు టీడీపీకి చేరారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేదే లేదన్నారు. ఐదేళ్లపాటు కక్ష సాధింపు ధోరణితోనే వైసీపీ పాలన సాగింది తప్ప, అభివృద్ధి ఎక్కడ చేయలేదని పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:05 AM