Share News

12న ప్రమాణ స్వీకారం రోజు.. ఉదయం 9.30 గంటలకే రండి!

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:09 AM

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల 12వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళలను విజయవాడ ఎయిర్‌పోర్టు యాజమాన్యం సవరించింది.

12న ప్రమాణ స్వీకారం రోజు.. ఉదయం 9.30 గంటలకే రండి!

సాయంత్రం విమానం ఎక్కాల్సి ఉన్నా.. ఉదయమే వచ్చేయండి

గన్నవరం ఎయిర్‌పోర్టు యాజమాన్యం సూచన

విజయవాడ, జూన్‌ 10 (ఆంధ్ర జ్యోతి): చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే ఈ నెల 12వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల వేళలను విజయవాడ ఎయిర్‌పోర్టు యాజమాన్యం సవరించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమాన సమయాలు కలిగిన ప్రయాణికులు, ఉదయం 9.30 గంటలకే విమానాశ్రయానికి చేరుకోవాలని కోరింది. ప్రయాణికులను దించటానికి, పికప్‌ చేసుకోవటానికి వచ్చేవారు సైతం ఇవే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా తరలివస్తున్న వీవీఐపీలతో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశం ఉన్నందున ఈ సూచన చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Jun 11 , 2024 | 08:21 AM