Share News

1000 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్‌

ABN , Publish Date - Jul 11 , 2024 | 03:28 AM

పాస్‌వర్డ్‌లు ఎంత సంక్లిష్టంగా పెట్టుకున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు వాటిని బ్రేక్‌ చేస్తున్నారు. తాజాగా 1000 కోట్ల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు లీక్‌ చేశారని, దానికి సంబంధించిన భారీ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పెట్టారని సెమాఫోర్‌ నివేదిక తెలిపింది. ఈ వ్యహారాన్ని అతిపెద్ద లీక్‌గా నిపుణులు

1000 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్‌

న్యూఢిల్లీ, జూలై 10: పాస్‌వర్డ్‌లు ఎంత సంక్లిష్టంగా పెట్టుకున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు వాటిని బ్రేక్‌ చేస్తున్నారు. తాజాగా 1000 కోట్ల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు లీక్‌ చేశారని, దానికి సంబంధించిన భారీ ఫైల్‌ను ఆన్‌లైన్‌లో పెట్టారని సెమాఫోర్‌ నివేదిక తెలిపింది. ఈ వ్యహారాన్ని అతిపెద్ద లీక్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ భారీ లీకేజీ వల్ల క్రెడెన్షియల్‌ స్టఫింగ్‌ దాడులు జరిగే ప్రమాదం ఉందని సెమాఫోర్‌ నివేదిక పేర్కొంది. అంటే.. హ్యాకర్లు ఒక పాస్‌వర్డ్‌ను ఉపయోగించి దానికి అనుసంధానమైన బహుళ ఖాతాల్లోకి చొరబడవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఏటీ అండ్‌ టీ, శాంటండర్‌ బ్యాంక్‌, టికెట్‌మాస్టర్‌, 23 అండ్‌ మీ వంటి ప్లాట్‌ఫామ్‌ల వినియోగదారులపై క్రెడెన్షియల్‌ స్టఫింగ్‌ దాడులు జరిగినట్టు సైబర్‌ న్యూస్‌ తెలిపింది. 2020 నుంచి ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ దాడులు అధికమయ్యాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక తెలియజేస్తోంది. సైబర్‌ దాడికి గురికాకుండా ఉండాలంటే.. బ్యాంకులు, బీమా, ఆర్థిక లావాదేవీలతో లింక్‌ అయిన ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఎనిమిది నుంచి పన్నెండు అక్షరాలతో కూడిన బలమైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. అందులో కనీసం ఒక క్యాపిటల్‌ లెటర్‌, ఒక అంకె, ఒక స్పెషల్‌ సింబల్‌ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్‌ చేసుకోకూడదని, వాటిని తరచూ మారుస్తూ ఉండాలని సూచించారు.

Updated Date - Jul 11 , 2024 | 03:28 AM