Share News

100 మిలియన్‌ టన్నులు!

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:04 AM

విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌- ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో సేలబుల్‌ స్టీల్‌ ఉత్పత్తి 100 మిలియన్‌ టన్నులు దాటింది.

100 మిలియన్‌ టన్నులు!

స్టీల్‌ ఉత్పత్తిలో విశాఖ ఉక్కు కర్మాగారం రికార్డు

విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌- ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో సేలబుల్‌ స్టీల్‌ ఉత్పత్తి 100 మిలియన్‌ టన్నులు దాటింది. ఇది ఒక రికార్డు. కర్మాగారంలో 1990లో ఉత్పత్తి మొదలైంది. ఏడాదికి 3.1 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో మొదలై ఆ తర్వాత 7.3 మిలియన్‌ టన్నులకు రూ.25 వేల కోట్లతో విస్తరించారు. మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌(బీఎఫ్‌)ల ద్వారా రోజుకు 22 వేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరగాల్సి ఉండగా ముడిపదార్థాల కొరతతో రెండేళ్లు బీఎఫ్‌-3 మూతపడింది. గతేడాది డిసెంబరు 27న జిందాల్‌ ఆర్థిక సాయంతో బీఎఫ్‌-3ని ప్రారంభించి పూర్తిస్థాయి ఉత్పత్తికి ప్రయత్నం చేశారు. అయితే కేవలం 45 రోజులు మాత్రమే మూడు బీఎఫ్‌లను నడిచాయి. ఆర్థిక సమస్యలతో ముడిసరకు సమకూర్చుకోలేక బీఎఫ్‌-1ను ఫిబ్రవరిలో మూసేశారు. ఈ జూలైలో సగటున రోజుకు రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా 14వేల టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా 12,170 టన్నులకే పరిమితమయ్యారు. వాస్తవానికి సేలబుల్‌ స్టీల్‌ 100 మిలియన్‌ టన్నుల మార్క్‌ను నాలుగేళ్ల క్రితమే అధిగమించాల్సి ఉంది. బీఎఫ్‌లకు అవసరమైనంత ముడి పదార్థాలు (ఐరన్‌ ఓర్‌, కోకింగ్‌ కోల్‌), విడిభాగాలు అందించలేకపోవడంతో చాలా ఆలస్యమైంది.

Updated Date - Jul 28 , 2024 | 07:56 AM