Share News

‘నెల్లూరు కార్యకర్త’ కోసం 10 కోట్లతో సంక్షేమ నిధి

ABN , Publish Date - May 26 , 2024 | 02:06 AM

నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని టీడీపీ కార్యకర్తల కోసం పొంగూరు నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆదాయం నుంచి ఏటా రూ.10 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

‘నెల్లూరు కార్యకర్త’ కోసం 10 కోట్లతో సంక్షేమ నిధి

పొంగూరు కుటుంబం నిర్ణయం

నెల్లూరు, మే 25(ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని టీడీపీ కార్యకర్తల కోసం పొంగూరు నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆదాయం నుంచి ఏటా రూ.10 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. తమ కోసం పనిచేసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండ గా నిలవాలనే దృక్పథంతో నారాయణ కుటుంబ సభ్యులు ప్రారంభించనున్న ఈ సంక్షేమ నిధి రాష్ట్ర రాజకీయల్లో కొత్త సంప్రదాయంగా భావిస్తున్నారు. కా ర్యకర్త కుటుంబానికి విద్య, వైద్యం సాయాలతోపాటు వివాహాది శుభ కార్యాల కు, గృహ నిర్మాణాలకు ఇలా కుటుంబ పరంగా ఎలాంటి అవసరం వచ్చినా సాయం అందించే వెసులుబాటు ఉండేలా కొత్త విధానంతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంక్షేమ నిధి విషయమై నారాయణ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... కార్యకర్తల రుణం కాస్తయినా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Updated Date - May 26 , 2024 | 02:06 AM