భానుజాకు కృషిరత్న అవార్డు
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:22 PM
రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజా సోమవారం కృషిరత్న అవార్డు అందుకున్నారు. ఆమె 20 సంవత్సరాలుగా రైతులను చైతన్య పరచడమే కాకుండా... మహిళ రైతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు.
కదిరి, అక్టోబరు 21 (ఆంరఽధజ్యోతి) : రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు భానుజా సోమవారం కృషిరత్న అవార్డు అందుకున్నారు. ఆమె 20 సంవత్సరాలుగా రైతులను చైతన్య పరచడమే కాకుండా... మహిళ రైతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. సెట్రీస్ ఫౌండేషన వారి సహకారంతో ఉమ్మడి జిల్లాలోని ఐదు మండలాల్లో రైతులకు ఉచితంగా లక్షల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. డాక్టర్ ఖాదరవలీ సిరిధాన్యాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేశారు. ఇందుకు గాను ఆమెను ముపావారపు ఫౌండేషన, రైతు నేస్తం వారు కృషిరత్న అవార్డుకు ఎంపిక చేశారు. సోమవారం విజయవాడలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెకు కృషి రత్న అవార్డును అందజేసి సన్మానించారు.